యాప్నగరం

టిఫర్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టిఫర్) టెక్నికల్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 27 Jan 2017, 4:44 pm
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టిఫర్) టెక్నికల్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో వివిధ విభాగాల్లోని ఇంజినీర్, టెక్నికల్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu tifr engineer trainee and technical trainee jobs notification
టిఫర్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు

ఇంజినీర్ ట్రెయినీ: 13
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్.

విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

టెక్నికల్ ట్రెయినీ: 13
విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా ఉండాలి.

వయసు: 28 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్య్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను Administrative Officer, NCRA-TIFR, Post Bag 3, Ganeshkhind, Pune University Campus, Pune 411007 చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి.

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.