యాప్నగరం

Telangana Jobs : గుడ్‌న్యూస్‌ చెప్పిన మంత్రి హరీశ్‌రావ్‌.. త్వరలో 1400 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

TS Health Minister T Harish Rao : తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో 1400 ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావ్‌ వెల్లడించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 20 Feb 2023, 5:46 pm
Telangana Jobs : తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. తాజాగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో 1400 ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ ఖాళీల భర్తీతో తెలంగాణలో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని మంత్రి (Harish Rao) ఆశాభావం వ్యక్తం చేశారు.
Samayam Telugu Telangana Jobs


నిమ్స్ లో 250 బెడ్స్, గాంధీలో 200 పడకలతో మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావ్‌ వివరించారు. ఓల్డ్ సిటీలోని ప్లేట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఇన్ ఫెక్షన్ల నివారణ-అవగాహన కార్యమ్రానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. పేట్ల బురుజు ఆస్పత్రి మాదిరిగానే.. ప్రతీ ఆస్పత్రి ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావ్‌ సూచించారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్ మెట్రో రైల్‌లో (Hyderabad Metro Rail) పలు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఏఎంఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ లాంటి 12 పోస్టులున్నాయి. విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు : 12
  • ఏఎంఎస్ ఆఫీసర్- 1
  • సిగ్నలింగ్ టీమ్- 2
  • రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- 6
  • ట్రాక్స్ టీమ్ లీడర్- 2
  • ఐటీ ఆఫీసర్- 1

నోటిఫికేషన్‌
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.