యాప్నగరం

TS Inter: తెలంగాణ ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. పరీక్షల తేదీలు, సెలవుల వివరాలివే

TS Inter Time Table: రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు జారీ చేసింది.

Samayam Telugu 6 Sep 2021, 9:47 pm
తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ జారీ చేసింది. ఈ సందర్భంగా బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ మాట్లాడుతూ.. అందరూ అకడమిక్‌ క్యాలెండర్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. దీనిని ఉల్లంఘించిన ప్రిన్సిపల్స్‌, యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అఫిలియేషన్‌ రద్దు చేయడంతో పాటు ఇతర చర్యలు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Samayam Telugu తెలంగాణ ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌


ఇదిలా ఉంటే ఈ ఏడాది కాలేజీ వర్కింగ్‌ డేస్‌ 220 రోజులు ఉండేలా ప్లాన్‌ చేశారు. జూలై 1వ తేదీ నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైన తరుణంలో అన్ లైన్ క్లాసులు 47 రోజులు.. ఫిజికల్ 173 రోజులు ఉండేలా అకడమిక్‌ ఇయర్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్స్‌ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు నిర్వహించనున్నారు. అనంతరం మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 12 వరకు థీయరి పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్‌ 13ను జూనియర్‌ కాలేజీలకు చివరి వర్కింగ్‌డేగా నిర్ణయించారు.

తెలంగాణలో స్కూళ్లకు దసరా, సంక్రాంతి సెలవులు, పరీక్షల తేదీలివే.. అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల
ముఖ్యమైన తేదీలివే:
  • డిసెంబర్‌ 13 నుంచి 18 వరకు హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు
  • ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు
  • ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌
  • మార్చి 23 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు
  • మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు
  • ఏప్రిల్‌ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
  • జూన్‌ 1 నుంచి ఇంటర్‌ కాలేజీలు రీఓపెన్‌.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.