యాప్నగరం

కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. త్వరలో శిక్షణ ప్రారంభం

TSLPRB | ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు వారివారి పరిధిలోని శిక్షణ కేంద్రాల్లో జనవరి 16న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి..

Samayam Telugu 30 Dec 2019, 10:45 am
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంక్రాంతి పండుగ తర్వాత శిక్షణ ప్రారంభం కానుంది. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతోపాటు.. డ్రైవర్, మెకానిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కూడా జనవరి 17 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.
Samayam Telugu TSLPRB


Read Also: ఆర్బీఐలో 926 ఉద్యోగాలు.. ఈ అర్హత చాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల్లో అభ్యర్థులకు 9 నెలలపాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దాదాపు 16 వేలకు పైగా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు జనవరి 16న సంబంధిత శిక్షణ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం, శిక్షణా సంస్థలకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.

Dont Miss: కోల్ ఇండియాలో 1326 ఉద్యోగాలు.. అర్హతలివే

రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 11 విభాగాల్లో 17156 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. సెప్టెంబరు 25న విడుదల చేసిన ఫలితాల్లో 13,373 మంది పురుషులు; 2,652 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

Read Also: NABARD'లో ఉద్యోగాలు.. టెన్త్ అర్హత


Read More..

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.