యాప్నగరం

పాలీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల!

తెలంగాణ పాలీసెట్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి మే 14 నుంచి ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభంకానుంది. 14 నుంచి 18 వరకు అభ్యర్థులు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసి ఫీజు చెల్లించాలి.

Samayam Telugu 12 May 2018, 3:16 pm
తెలంగాణ పాలీసెట్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి మే 14 నుంచి ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభంకానుంది. 14 నుంచి 18 వరకు అభ్యర్థులు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసి ఫీజు చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం మే 15 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 21 వరకు ఆప్షన్లు నమోదుచేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినవారిని మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తారు. ఆప్షన్ల నమోదు ప్రకారం అభ్యర్థులకు మే 23న సీట్లను కేటాయిస్తారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
Samayam Telugu TSPOLYCET.


ఏప్రిల్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పాలీసెట్ పరీక్షకు లక్షా 21 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన ఫలితాలు మే 1న విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షలో మొత్తం లక్షా 12 వేలమంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో మొత్తం 92.21శాతం ఉత్తీర్ణత నమోదైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.