యాప్నగరం

'టీఎస్‌ సెట్‌ - 2018' నోటిఫికేషన్...!

తెలంగాణలో రిసెర్చ్‌ఫెలోషిప్ (పీహెచ్‌డీ), లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు) కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం 'తెలంగాణ సెట్‌ (స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్టు) -2018' నోటిఫికేషన్ విడదల చేసింది.

TNN 10 Mar 2018, 12:58 pm
తెలంగాణలో జూనియర్ రిసెర్చ్‌ ఫెలోషిప్ (పీహెచ్‌డీ), లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం 'తెలంగాణ సెట్‌ (స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్టు) -2018' నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 29 సబ్జెక్టులకుగాను... జులై 15న ఈ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రెండు పేపర్లకే పరీక్షను పరిమితం చేయనున్నారు. అభ్యర్థులు మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 14 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Samayam Telugu ts set 2018 notification
'టీఎస్‌ సెట్‌ - 2018' నోటిఫికేషన్...!


రూ.1500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 4 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
Notification
Website

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.