యాప్నగరం

TS: ఇంటర్‌ సిలబస్‌ తగ్గింపుపై వివాదం.. వివరణ ఇచ్చిన ఇంటర్‌ బోర్డు..!

ఇంటర్మీడియట్‌ ఆర్ట్స్‌ గ్రూపుల్లో సిలబస్‌ తొలగింపు గందరగోళంగా మారింది.

Samayam Telugu 23 Sep 2020, 4:44 pm
ఇంటర్‌ సిలబస్‌ తగ్గింపు అంశంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంటర్మీడియట్‌ ఆర్ట్స్‌ గ్రూపుల్లో సిలబస్‌ తొలగింపు గందరగోళంగా మారింది. చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం తదితర సబ్జెక్టుల్లో కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై వివాదం నెలకొంది. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలకు సంబంధించిన పాఠాల తొలగింపుపై విమర్శలు వచ్చాయి.
Samayam Telugu తెలంగాణ ఇంటర్‌ బోర్డు


దీంతో ఇంటర్మీడియట్‌ బోర్డు వెనక్కి తగ్గింది. పాఠాల తొలగింపు ప్రతిపాదన మాత్రమేనని.. ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వివరణ ఇచ్చారు. జాతీయ నేతలు, సంఘ సంస్కర్తలు, ప్రముఖులపై పాఠాలు తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కరోనా పరిస్థితుల వల్ల నాలుగు నెలలు వృథా అయినందున 30శాతం సిలబస్‌ కుదింపునకు ప్రభుత్వం అంగీకరించిందని ఉమర్‌ జలీల్‌ తెలిపారు.

Must read: నవంబరు 1 నుంచి డిగ్రీ, పీజీ క్లాసులు ప్రారంభం.. వారంలో ఆరు రోజులు కాలేజీలు..!

హ్యుమానిటీస్‌ గ్రూపుల్లో పాఠాల తొలగింపుపై నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిపుణుల కమిటీలు కొన్ని పాఠాల తొలగింపునకు సిఫార్సు చేశాయన్నారు. అయితే.. ఆ సిఫార్సులపై చర్చించి ఆమోదించాల్సి ఉందన్నారు. సైన్స్‌ గ్రూపులకు సంబంధించిన పాఠాలు సీబీఎస్ఈ సూచనల ప్రకారమే తొలగించినట్టు వివరించారు.

Also read: టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్) హాల్టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.