యాప్నగరం

Telangana Police Constable Results: కానిస్టేబుల్ రాతపరీక్ష ఫలితాలు విడుదల..

ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని అక్టోబరు 5న విడుదల చేశారు. అక్టోబరు 8వరకు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫైనల్ కీని విడుదల చేశారు. ప్రిలిమ్స్ ఫలితాలను ఆదివారం (అక్టోబరు 14) విడుదలచేశారు.

Samayam Telugu 16 Oct 2018, 1:16 pm
తెలంగాణలో నిర్వహించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక అర్హత పరీక్ష ఫలితాలు ఆదివారం (అక్టోబరు 14) విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 50.09శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఫోన్ నెంబరు, పాస్‌వర్డ్ ఆధారంగా ఫలితాలను చూడవచ్చు. కేటగిరీల వారీగా ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
Samayam Telugu police

ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో మొత్తం 16,925 పోస్టులకు పోలీస్ శాఖ మే 31న నోటిఫికేషన్ విడుదల చేయగా.. 4,79,158 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,78,567 మందిని ప్రిలిమినరీ రాతపరీక్షకు ఎంపికచేశారు. పరీక్షకు ఎంపికైనవారిలో 4,49,584 (93.95) శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరికి సెప్టెంబరు 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 ఎంపికచేసిన ప్రదేశాల్లో 966 పరీక్ష కేంద్రాలను పరీక్ష కోసం ఏర్పాటు చేశారు.


ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని అక్టోబరు 5న విడుదల చేశారు. అక్టోబరు 8వరకు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫైనల్ 'కీ'ని విడుదల చేశారు. ప్రిలిమ్స్ ఫలితాలను ఆదివారం (అక్టోబరు 14) విడుదలచేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.