యాప్నగరం

అభ్యర్థులకు అలర్ట్‌.. ఆగస్టులో స్తంభాలు ఎక్కే పరీక్ష

జేఎల్‌ఎం ఎంపికలో కీలకమైన స్తంభాలు ఎక్కే పరీక్షను ఆగస్టు మూడు, నాలుగు వారాల్లో నిర్వహించాలని నిర్ణయించారు.

Samayam Telugu 24 Jul 2020, 12:05 pm
జూనియర్‌ లైన్‌ మెన్‌ (జేఎల్‌ఎం) ఎంపికలో కీలకమైన స్తంభాలు ఎక్కే పరీక్షను ఆగస్టు మూడు, నాలుగు వారాల్లో నిర్వహించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)‌ నిర్ణయించింది. దీని కోసం 15 సర్కిళ్ల పరిధిలో ఆరు కమిటీలు వేశారు. వీడియో చిత్రీకరణ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
Samayam Telugu టీఎస్‌ఎస్పీడీసీఎల్


టీఎస్పీడీసీఎల్‌ పరిధిలో 2500 జేఎల్‌ఎం పోస్టుల భర్తీ కోసం 2019 ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల కాగా... డిసెంబరు 15న రాత పరీక్ష జరిగింది. జనవరి 17న ఫలితాలు వెల్లడికాగా... ఈనెల 9వ తేదీన అర్హుల జాబితాను టీఎస్పీడీసీఎల్‌ ప్రకటించింది. ఒక్కో పోస్టుకు ఇద్దరేసి చొప్పున (1:2 నిష్పత్తిలో) అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ఆ తర్వాత పోల్‌ క్లైంబింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

Also read: JEE MAINS 2020 రాసే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నిబంధన తొలగించిన కేంద్రం

ధ్రువపత్రాల పరిశీలన, పోల్‌ క్లైంబింగ్‌ పరీక్షల నిర్వహణ కోసం సంస్థ యాజమాన్య చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ నేతృత్వంలో ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ధ్రువపత్రాల పరిశీలన, పోల్‌ క్లైంబింగ్‌ పరీక్షలకు నిర్దేశిత తేదీల్లో హాజరు కావాలని అర్హులైన అభ్యర్థులకు ఎంపిక కమిటీ కాల్‌ లెటర్స్‌ పంపనుంది. స్తంభాలు ఎక్కే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే జేఎల్‌ఎం ఉద్యోగం దక్కనుంది. దీంట్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వనున్నారు.

Also read: 70 శాతం మందికి ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కావట్లేదట..!

Also read: ఆందోళనలో 14 వేల మంది విద్యార్థులు.. ఎందుకంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.