యాప్నగరం

TS: సెప్టెంబరు 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కష్టమే..?

యూజీసీ గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభం కావడమనేది కష్టంగా మారనుంది. ఎందుకంటే..

Samayam Telugu 1 Jul 2020, 5:30 pm
జూన్‌ నెలలో యూజీసీ వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 1 నుంచి ఇంజనీరింగ్‌ మొదటి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావాలి. జూన్‌ 18న విద్యాశాఖ మంత్రి సమక్షంలో అధికారులు ఇదే నిర్ణయించారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల రీత్యా ప్రవేశ పరీక్షలు వాయిదా వేశారు.
Samayam Telugu బీటెక్‌ క్లాసులు


ఇవి మళ్లీ ఆగస్టు రెండో వారంలో జరిగే అవకాశాలున్నాయి. మరి ఫలితాలు ఇవ్వడం, కౌన్సెలింగ్‌ తదితర ప్రక్రియలు పూర్తికావాల్సి ఉంది. ఇవన్నీ జరిగి.. సెప్టెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభం కష్టమనేది నిపుణుల అభిప్రాయం.

ప్రవేశ పరీక్షలు వాయిదా పడటం ఇది రెండోసారి. మొదట్లో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2న ఈసెట్‌, 4 నుంచి ఎంసెట్‌ జరగాలి. ఆ నెలాఖరుకు అన్నీ పూర్తయ్యేలా షెడ్యూల్‌ ఇచ్చారు. కరోనా కారణంగా వాయిదా వేసి జులై 1 నుంచి ప్రారంభమయ్యేలా తేదీలు ఖరారు చేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడ్డాయి.

Also read: విద్యార్థులకు గమనిక.. దోస్త్‌ 2020 ప్రక్రియ వాయిదా

పరీక్షల ఆలోచన బహు కష్టం..!
మార్చి మూడో వారంలో ఇంటర్ ‌(ద్వితీయ) పరీక్షలు పూర్తయ్యాయి. మే మొదటివారంలో ఎంసెట్‌, ఏప్రిల్‌లోనే జేఈఈ మెయిన్‌ రెండో విడత, మే నెలలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జరగాలి. కానీ జులై మొదలైంది. ఈ నెలలోనూ పరీక్షలు లేవు. మళ్లీ ఆగస్టులోనే అంటున్నారు.

ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు మార్చి మూడో వారం నుంచే ఎంసెట్‌, నీట్‌ తదితర పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఇక ఆగస్టు అంటే అయిదు నెలలపాటు పరీక్షల ఆలోచనతోనే ఉండటం విద్యార్థులకు బహు కష్టంగా మారింది.

Also read: ఆగస్టు రెండో వారంలో ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలు ప్రారంభం..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.