యాప్నగరం

అందవికారం అధిక కట్నానికి మూలం?!

పెళ్లి కూతురు అందవికారం, అంగవైకల్యాలే అధిక కట్నానికి మూల కారణమని మహారాష్ట్రలో ఇంటర్మీడియట్

TNN 3 Feb 2017, 11:05 am
పెళ్లి కూతురు అందవికారం, అంగవైకల్యాలే అధిక కట్నానికి మూల కారణమని మహారాష్ట్రలో ఇంటర్మీడియట్ సోషియాలజీ పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చడం తీవ్రదుమారానికి దారి తీసింది. ఇంటర్మీడియట్ (12వ తరగతి) సోషియాలజీ పాఠ్యపుస్తకాల్లో భారదేశంలో సామాజిక భూతం-కట్నం, గృహహింస అనే అధ్యాయంలో ఈ పెళ్లికూతుళ్లు అందంగా ఉండకపోవడం, అంగవైకల్యంలో పుట్టడం వంటి కారణాలతో పెళ్లి కొడుకులు అధిక వరకట్నాన్ని డిమాండ్ చేస్తున్నారని..ఈ కారణం వల్లే గృహ హింస, ఇతర వేధింపులు చోటు చేసుకుంటున్నాయని పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడం చర్చనీయాంశమైంది.
Samayam Telugu ugliness and disabilities are reasons behind higher dowry class xii
అందవికారం అధిక కట్నానికి మూలం?!


మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేన్ 2013లో ఈ పాఠ్యపుస్తకాలను ముద్రించింది.

అయితే పాఠ్యపుస్తకంలో పేర్కొన్న అంశం తప్పు కాకపోయినప్పటికీ..అదే వాస్తవంగా జరుగుతున్నప్పటికీ...యుక్తవయసులో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు అలా ప్రత్యక్షంగా బోధించడం ఇబ్బందిగా ఉందని సోషియాలజీ టీచర్లు చెబుతున్నారు. క్లాసులో ఎవరైనా అంగవైకల్యం ఉన్న విద్యార్థినులు ఉంటే ఇలాంటి పాఠాలు బోధిస్తే వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోననే ఆందోళన తమ వేధిస్తుందని దక్షిణ ముంబై కాలేజీలో సోషియాలజీ బోధించే టీచర్ అభిప్రాయపడ్డారు.

‘‘కట్నం అనేది ఓ భూతమని, దాన్ని అంతం చేయాలని విద్యార్థులకు బోధించాలి. కానీ పాఠ్యపుస్తకంలో ముద్రించడం మంచిదికాదు. విద్యార్థుల్లో తప్పుడు అభిప్రాయాలు కల్గించే వ్యాఖ్యలు, అధ్యయాలు తొలగించాలి’’ అని ప్రొఫెసర్ నందిని సర్దేశాయ్ తెలిపారు.

పాఠ్యపుస్తకంలో వరకట్నంపై తప్పుడు సంకేతాలు పంపే విధంగా ఉన్న అంశంపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహారాష్ట్ర విద్యాశాఖమంత్రి వినోద్ తవ్డే స్పందించారు. వరకట్నంపై పాత సిలబస్ లో పొందుపరిచామని..అయితే ప్రస్తుతానికి సిలబస్ మారిందని..కొత్త పుస్తకాలు పంపిణీ చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. కొత్త సిలబస్ లోనూ అభ్యంతరకర అంశాలుంటే తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.