యాప్నగరం

Grama Volunteer Result: 'గ్రామ వాలంటీర్' ఫలితాలు ఎప్పుడంటే?

ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 1న నియామకపత్రాలు అందజేయనున్నారు. వీరికి ఆగస్టు 5 నుంచి 10 వరకు నిర్దిష్ట అంశాల్లో శిక్షణనిస్తారు. శిక్షణ అనంతరం ఆగస్టు 15న వీరికి పోస్టింగ్ ఇస్తారు.

Samayam Telugu 2 Aug 2019, 2:30 pm
ఏపీలో గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టుల ఇంటర్వ్యూ ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నారు. వాస్తవానికి ఆగస్టు 1న గ్రామ వాలంటీర్/ వార్డ్ వాలంటీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు విడుదల చేయలేకపోయారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. మెరిట్ జాబితాలో అర్హత పొందినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా అభ్యర్థులు ఫలితాలు/ మెరిట్ జాబితాను చూసుకోవచ్చు.
Samayam Telugu APGV


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా గ్రామ/పట్టణ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జూన్ 24 నుంచి జులై 5 వరకు దరఖాస్తులను స్వీకరించారు. పట్టణ(వార్డు) వాలంటీర్ ఉద్యోగాలకు జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జులై 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులు మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. వాలంటీర్ పోస్టులకు ఎంపికైనవారికి నెలకు రూ.5000 జీతంగా ఇవ్వనున్నారు.
వెబ్‌సైట్

Read Also: గ్రామ/ వార్డు సచివాలయ నోటిఫికేషన్, తదితర వివరాలు...

అభ్యర్థుల వివరాలు ఇలా...

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు9,62,708
పరిశీలించిన దరఖాస్తులు 9,62,708
సరైన దరఖాస్తులు9,26,264
తిరస్కరణకు గురైన దరఖాస్తులు 36,444
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు9,26,264
ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు6,60,463
ఇంటర్వ్యూకు గైర్హాజరైన అభ్యర్థులు2,65,801

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.