యాప్నగరం

AP SSC Results 2021: ఏపీ 10వ తరగతి ఫలితాలపై తాజా సమాచారం.. గ్రేడ్లు ఇలా కేటాయిస్తారు

AP 10th class result 2021: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలువడింది. ఫలితాల వెల్లడికి సంబంధించిన ఫార్ములాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకే చేసింది.

Samayam Telugu 2 Aug 2021, 4:27 pm
కరోనా కారణంగా ఏపీ 10వ తరగతి పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలువడింది. ఫలితాల వెల్లడికి సంబంధించిన ఫార్ములాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకే చేసింది.
Samayam Telugu ఏపీ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు 2021


విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫలితాల వెల్లడి, రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావటంతో ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై హైపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చింది.

2020, 2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి హైపవర్ కమిటీ రూపోందించిన ఫార్ములాను ప్రభుత్వం ఆమోదించింది. 2019-2020 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించేందుకు నిర్ణయం తీసుకుంది. 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని కమిటీ సూచించింది.

డిగ్రీతో నాబార్డులో 162 అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌ జాబ్స్‌.. ఆగస్టు 7 దరఖాస్తులకు చివరితేది
ఇంటర్నల్‌గా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించాలని స్పష్టం చేసింది. 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు 2020లో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు గతంలోని వారి సామర్ధ్యం ఆధారంగా 20 మార్కులకు లెక్కించి పరిగణించాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఇక 2021 విద్యా సంవత్సరంలోని విద్యార్ధులందరికీ ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కులను 30 శాతానికి.. 70 శాతం వెయిటేజి స్లిప్ టెస్టులకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలకు హాజరు కాని విద్యార్ధులకు పాస్ గ్రేడ్ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. అతి త్వరలోనే ఫలితాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.