యాప్నగరం

యూడీసీ & స్టెనోగ్రాఫర్ రాతపరీక్ష ఫలితాలు వెల్లడి

ESIC Recruitment Result 2019 | ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లో యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెల్లడించింది. ఫలితాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది.

Samayam Telugu 25 Sep 2019, 1:06 pm

ప్రధానాంశాలు:

  • వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో
  • రీజియన్లవారీగా కటాఫ్ మార్కులు కూడా వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ESIC
న్యూఢిల్లీలోని 'ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్' అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ), స్టెనోగ్రాఫర్ 'ఫేజ్-2' మెయిన్ పరీక్ష ఫలితాలను బుధవారం (సెప్టెంబరు 25) విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఒక్క మహారాష్ట్ర రీజియన్‌కు చెందిన ఫలితాలను తప్ప అన్ని రీజియన్ల ఫలితాలను ఈసీఐసీ విడుదల చేసింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Read Also: CTET-2019 దరఖాస్తుకు నేడే ఆఖరు

దేశవ్యాప్తంగా పలు రీజియన్ల పరిధిలో మొత్తం 7,837 యూడీసీ & స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఈఎస్‌ఐసీ సెప్టెంబరు 1న 'ఫేజ్-2' రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫేజ్-2లో అర్హత సాధించిన అభ్యర్థులకు 'ఫేజ్-3' కంప్యూటర్ స్కిల్ టెస్ట్ (CST) నిర్వహించనున్నారు. ఒక్క మహారాష్ట్ర మినహా.. మిగతా అన్ని రీజియన్లలో అక్టోబరు 20న 'ఫేజ్-3' పరీక్ష నిర్వహించనున్నారు.

Read Also: కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడి.. కటాఫ్ మార్కుల వివరాలు

కనీస అర్హత మార్కులు ఇలా..
కేటగిరీఅర్హత మార్కులు
ఎస్సీ70 (35%)
ఎస్టీ70 (35%)
ఓబీసీ80(40%)
జనరల్/ EWS90 (45%)
దివ్యాంగులు60 (30%)
ఎక్స్-సర్వీస్‌మెన్ 70 (35%)
రీజియన్లు, కేటగిరీల వారీగా 'ఫేజ్-3' పరీక్షకు ఎంపికైన అభ్యర్థులకు నిర్ణయించిన కటాఫ్ మార్కులు ఇలా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.