యాప్నగరం

India Post GDS Results : పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఫలితాలు విడుదల.. ఎంపికైన ఏపీ, తెలంగాణ అభ్యర్థుల జాబితా ఇదే

India Post GDS Gramin Dak Sevaks Results 2023 : దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో ఇండియా పోస్ట్‌ 40,889 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 15 May 2023, 8:51 am

ప్రధానాంశాలు:

  • ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ ఫలితాలు విడుదల
  • జనవరిలో 40,889 పోస్టుల భర్తీకి ప్రకటన
  • మే 22 లోగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu India Post GDS 3rd Merit List 2023
India Post GDS 3rd Merit List 2023 : ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ ఫలితాలు విడుదలయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి 3వ జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో ఇండియా పోస్ట్‌ 40,889 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈ-మెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు మే 22 లోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నియామక ఉత్తర్వులు అందజేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఏపీ జీడీఎస్‌ ఫలితాల జాబితా

AndhraPradesh_DV_List3
తెలంగాణ జీడీఎస్‌ ఫలితాలా జాబితా

Telangana_DV_List3 (1)
UPSC : యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్ 2024 విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..?
UPSC Exam Calendar 2024 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2024 సంవత్సరానికి సంబంధించిన UPSC Exam Calendar 2024 ను విడుదల చేసింది. UPSC పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://upsc.gov.in/ ను సందర్శించడం ద్వారా పరీక్ష తేదీలను చూడొచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆలిండియా సర్వీసెస్‌ ఎగ్జామ్స్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2024లో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE) నోటిఫికేషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న విడుదల కానుంది. 2024 మే 26న సీఎస్‌ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 5 మార్చి 2024 లోపు దీనికి అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు మెయిన్స్‌ రాయడానికి అర్హులు.

UPSC Exam Calendar 2024 ఇదే.. క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.