యాప్నగరం

RGUKT CET Result 2020: ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

RGUKT-CET 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.

Samayam Telugu 12 Dec 2020, 2:28 pm
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్ (‌RGUKT-CET) ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాప్ టెన్‌ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలవడం గమనార్హం. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్‌ సిలబస్‌ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు.
Samayam Telugu ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు


ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

ఈ పరీక్షకు 85,755 మంది విద్యార్ధులు హాజరయ్యారని పేర్కొన్నారు. జనవరి 4 నుంచి కౌన్సెలింగ్‌, 18 నుంచి తరగతులు మొదలవుతాయని మంత్రి వెల్లడించారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ ప్రాసెస్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్‌లైన్‌ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.