యాప్నగరం

AIIMS MBBS Results: ఎయిమ్స్ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల.. టాపర్‌గా నిలిచిన 'నీట్' రెండో ర్యాంకర్ బన్సాల్

ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో మొత్తం 3884 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.

Samayam Telugu | 13 Jun 2019, 12:59 pm

ప్రధానాంశాలు:

  • అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు
  • కటాఫ్ మార్కులు కూడా అందుబాటులో
  • టాపర్‌గా నిలిచిన.. నీట్-2019 రెండో ర్యాంకర్ బన్సాల్
  • త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ.. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu aiims
ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష-2019 ఫలితాలను 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)' విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. కటాఫ్ మార్కుల వివరాలను కూడా అందుబాటులో ఉంచింది.
ప్రవేశ పరీక్ష ఫలితాలు, కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈ ఏడాది ఎయిమ్స్ ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,38,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 11,380 మంది మాత్రమే అర్హత సాధించారు. అర్హత పొందినవారిలో 7,352 మంది బాలురు ఉండగా.. 4,027 మంది బాలికలు ఉన్నారు. ఒక్క ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.

నీట్ రెండో ర్యాంకరే 'టాపర్'..
ఫలితాల్లో ఢిల్లీకి చెందిన భావిక్ బన్సాల్ 100 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. బన్సాల్ నీట్-2019 ఫలితాల్లో రెండో ర్యాంకు నిలవడం విశేషం. మొత్తం నలుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. బన్సాల్ తర్వాత వడోదరాకు చెందిన విశ్వ హితేంద్ర రెండో స్థానంలో నిలిచాడు. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు మే 25, 25 తేదీల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.