యాప్నగరం

SSC CGL Result 2021: ఎస్ఎస్​సీ సీజీఎల్​ టైర్-​​1 ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ssc.nic.in SSC CGL Result 2021: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 2021 లెవల్ టైర్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ టైర్ 1 పరీక్షను ఆన్​లైన్​ విధానంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఆగస్టు 13 నుండి 24 మధ్య నిర్వహించారు.

Samayam Telugu 27 Nov 2021, 11:11 am
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ (CGL)–2020 లెవల్ టైర్ 1 పరీక్ష ఫలితాలు (SSC CGL Result 2020 Tier 1 Results) విడుదలయ్యాయి. ఈ టైర్ 1 పరీక్షను ఆన్లైన్ విధానంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఆగస్టు 13 నుండి 24 మధ్య నిర్వహించారు.
Samayam Telugu ఎస్ఎస్​సీ సీజీఎల్​ 2020 టైర్​​1 ఫలితాలు


సెప్టెంబర్ 2న టైర్-1 పరీక్ష కీని (Exam Key) విడుదల చేశారు. కాగా.. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్సైట్ నుంచి మెరిట్ లిస్ట్ను (Merit List) డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్లో వారి హాల్ టికెట్ నంబర్ ఉంటే క్వాలిఫై అయినట్లే లెక్క. టైర్ 1 పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆ తర్వాత టైర్ 2, టైర్ 3 పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

TS Inter Results: డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు..?
సీజీఎల్ టైర్1 పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీ వారీగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ షార్ట్లిస్ట్ ప్రకటించింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ (లిస్ట్–1), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (లిస్ట్–2), ఇతర పోస్టులు (లిస్ట్–3) వేర్వేరు కటాఫ్లను నిర్ణయించింది.

సీజీఎల్ టైర్-1 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. దానిలోనూ క్వాలిఫై అయిన వారికి టైర్-3 డిస్క్రిప్టివ్ పరీక్ష, టైర్ 4 కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్/ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటన్నింటిని క్లియర్ చేసిన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగంలో జాయిన్‌ చేసుకుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.