యాప్నగరం

TS CPGET Results: తెలంగాణ CPGET ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ చెక్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే

Telangana TS CPGET Result 2022: ఈ యేడాది ఆగస్టు 11 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సీపీగెట్‌ 2022 పరీక్షలకు దాదాపు 57,262 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 21 Sep 2022, 10:08 am
TS CPGET 2022 Result: తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CPGET)-2022 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ (ఉన్నత విద్యా మండలి) ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్‌ చేతుల మీదుగా మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 94.14 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తాచాటారు. 38,712 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరుకాగా, 36,437 మంది అర్హత సాధించారు. 18,550 అబ్బాయిలు పరీక్షకు హాజరుకాగా, 17,613 మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 57,262 మంది పరీక్షలకు హాజరుకాగా, వారిలో 54,050 మంది (94శాతం) అర్హత సాధించారు. నిరుడుతో పోలిస్తే ఉత్తీర్ణత రెండు శాతం పెరిగింది.
Samayam Telugu TS CPGET Result 2022


ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cpget.tsche.ac.in/ లో విద్యార్ధులు ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఈ యేడాది ఆగస్టు 11 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సీపీగెట్‌ 2022 పరీక్షలకు దాదాపు 57,262 మంది విద్యార్ధులు హాజరయ్యారు. మొత్తం 45 సబ్జెక్టుల్లో పీజీ, 4 యేళ్ల ఇంటిగ్రేటెడ్‌, పీజీ డిప్లొమా కలిపి 50 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు.

ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం- హైదరాబాద్.. వంటి ఎనిమిది యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సారి ఫలితాల్లో అర్హత సాధించిన మహిళలకు మహిళా యూనివర్సిటీలో కూడా అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.