యాప్నగరం

UPSC Prelims result 2020: యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..!

సివిల్స్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది.

Samayam Telugu 24 Oct 2020, 9:34 am
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అక్టోబర్ 4న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.
Samayam Telugu యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ ఫలితాలు


ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు. అక్టోబర్ 28 నుంచి నవంబరు 11వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు మెయిన్ పరీక్షల కోసం డీటెయిల్డ్‌ అప్లికేషన్ ఫామ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

పరీక్షా ఫలితాలకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే కింద ఇచ్చిన నెంబర్లకు ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల మధ్య ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ నెం. 011-23385271, 011-23098543 లేదా 011-23381125. అలాగే.. అభ్యర్థుల సందేహాల నివృత్తికి న్యూఢిల్లీ, షార్జహాన్ రోడ్, ధోల్‌పూర్ హౌస్‌లోని ఎగ్జామినేషన్‌ హాల్‌కు సమీపంలో ప్రత్యేక కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఈ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు.

అర్హులైన అభ్యర్థుల జాబితా:

CS-Prelims Results20

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.