యాప్నగరం

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఫిబ్రవరి 1లోపు అప్లయ్‌ చేసుకోండి

టెట్, ఎస్‌జీటీ, ఎస్‌.ఏ, టీజీటీ, పీజీటీ, ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Samayam Telugu 20 Jan 2021, 12:41 pm
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ.. పేదరికం, ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. అలాంటి వారికి దిల్‌సుఖ్‌నగర్‌లోని విజేత స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్‌ వి.జె.రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెట్, ఎస్‌జీటీ, ఎస్‌.ఏ, టీజీటీ, పీజీటీ, ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Samayam Telugu కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌


PMKVY: నిరుద్యోగులకు కేంద్రం కొత్త స్కీమ్‌.. ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం.. మధ్యలోనే చదువు మానేసిన వారికి వరం
ఈ శిక్షణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు మీడియంలో చదివిన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. తెల్లరేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం లేదా వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉన్న అభ్యర్థులు నేరుగా స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో రెండు పాస్‌పోర్టు ఫొటోలతో సంప్రదించవచ్చు.

ఆసక్తగల అభ్యర్థులు ఫిబ్రవరి 1లోపు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మూడు నెలల పాటు శిక్షణ తరగతులు, పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకు దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్, మెట్రో పిల్లర్‌ ఏ1531 ఎదురుగా ఉన్న స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.