యాప్నగరం

Telangana ePass: తెలంగాణ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం అప్లయ్‌ చేసుకోండి.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Ts ePass Scholarship 2022: తెలంగాణ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను (PMS) మంజూరు చేయడం కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు ఈ- పాస్ (ePass) పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 16 May 2022, 1:02 pm
TS Post Matric Scholarship 2022: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను (PMS) మంజూరు చేయడం కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు ప్రభుత్వ వెబ్ సైట్ అయిన ఈ- పాస్ (ePass) పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి మే 21 చివరితేది.
Samayam Telugu తెలంగాణ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ 2022


రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతి (BC), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC), మైనారిటీలు, శారీరక వికలాంగ విద్యార్థుల ప్రయోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెన్యూవల్‌తో పాటు తాజా స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం ఈ-పాస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలనుకునే విద్యార్థులు తమ డేటాను అక్టోబర్ 24లోపు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Indian Railway Recruitment 2022: రాత పరీక్ష లేకుండానే.. రైల్వేలో 150 సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. మే 24 దరఖాస్తులకు చివరితేది
విద్యార్హతలు- ఇతర సమాచారం:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. SC లేదా ST వర్గానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC, లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75 శాతంగా ఉండాలి. ఈ నిబంధనలు ఉంటేనే అర్హులు.

అప్లయ్‌ చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు
పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (PMS) కోసం దరఖాస్తు‌దారులు క్వాలిఫైయింగ్ పరీక్ష మార్క్ షీట్‌తో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలకు సంబంధించి పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

గమనిక: విద్యార్థులు తప్పుడు సమాచారం నమోదు చేస్తే దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్‌ సమయంలో చాలా జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలి. చివర్లో సబ్‌మిట్‌ చేసే సమయంలో పూర్తి వివరాలను చెక్‌ చేసుకుని సబ్‌మిట్‌ చేయాలి.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.