యాప్నగరం

Gorantla Madhav నామినేషన్‌కు లైన్ క్లియర్.. హైకోర్టులో ఊరట

హిందూపురం ఎంపీగా వైసీపీ నుంచి పోటీకి సిద్ధమైన గోరంట్ల మాధవ్. వీఆర్‌ఎస్‌ను ఆమోదించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన మాధవ్. వెంటనే వీఆర్ఎస్‌ను ఆమోదించాలని కోర్టు ఆదేశం.

Samayam Telugu 20 Mar 2019, 7:54 pm

ప్రధానాంశాలు:

  • వీఆర్ఎస్‌కు 90 రోజులకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్న పోలీస్‌శాఖ
  • రాజకీయ కారణాతో వీఆర్ఎస్‌కు ఆమోదం తెలపకపోవడం ఏంటన్న కోర్టు
  • వెంటనే రాజీనామాను ఆమోదించాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించిన హైకోర్టు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ci
అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ అభ్యర్థి, సీఐ గోరంట్ల మాధవ్‌కు హైకోర్టు ఊరటిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా విధుల నుంచి మాధవ్‌ను రిలీవ్ చేయాలని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మాధవ్ నామినేషన్‌ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో రెండు మూడు రోజుల్లో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారట.
తాను వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నా ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలపకపోవడంపై మాధవ్ కోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. 90 రోజులకు ముందుగా వీఆర్ఎస్‌‌కు దరఖాస్తు చేసుకోవాలని పోలీసుశాఖ వాదించగా.. మాధవ్ తరపు లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత మాధవ్ పోటీ చేసేందుకు వీలుగా విధుల నుంచి తప్పించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్‌ఎస్‌ను నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది.

గతంలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాలు విసిరి, మీసం తిప్పారు. తర్వాత తన ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసి రాజకీయాల్లో వస్తానని ప్రకటించి.. వైసీపీలో చేరారు. జగన్ కూడా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. నామినేషన్ వేసే సమయానికి వీఆర్ఎస్ అంశం తెరపైకి వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు నెలలైనా పోలీస్ శాఖ ఆమోదం తెలపలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.