యాప్నగరం

ఏపీలో పోలింగ్ 80 శాతం దాటొచ్చు: ఎన్నికల అధికారి

ఏపీలో పోలింగ్ 80 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధకారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలను ధ్వంసం చేయడంపై ఏడు కేసులు నమోదయ్యాయన్నారు.

Samayam Telugu 11 Apr 2019, 8:16 pm
ఆంధ్రప్రదేశ్‌లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ గడువు ముగిసింది. కానీ ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం కలగడంతో చాలా చోట్ల సాయంత్రం 5 గంటల సమయంలోనూ ఓటేసేందుకు భారీ సంఖ్యలో జనం క్యూ లైన్లలో నిలబడ్డారు. వీరందర్నీ ఓటేసేందుకు అనుమతిస్తామని ఏపీ ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్రంలో 25 చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయని ద్వివేది తెలిపారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోయారని తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదన్నారు.
Samayam Telugu diwedhi


ఏపీలో పోలింగ్ 80 శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ద్వివేది చెప్పారు. ఈవీఎంలు మొరాయించిన, రిగ్గింగ్ ఆరోపణలు వచ్చి ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించే అవకాశాలను రేపు పరిశీలిస్తామన్నారు. తుది నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది తప్పిదాల వల్ల ఈవీఎంల నిర్వహణలో సమస్యలు తలెత్తాయన్నారు. శిక్షణ ఇచ్చినా తప్పిదాలకు పాల్పడిన ఎన్నికల సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ పూర్తి వివరాలను వెల్లడించడానికి సమయం పడుతుందన్నారు.

సాయంత్రం ఐదు గంటల వరకు ఏపీలో 65.96 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతాల్లో...
శ్రీకాకుళం - 63.77
విజయనగరం - 74.18
విశాఖపట్నం - 55.82
పశ్చిమగోదావరి - 67.28
కృష్ణా - 64.50
గుంటూరు - 61.12
ప్రకాశం - 70.74
నెల్లూరు - 66.90
చిత్తూరు - 69.32
కడప - 63.90
అనంతపురం - 67.08
కర్నూలు - 63

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.