యాప్నగరం

Kadapa Polling Booth: సీఎం రమేష్‌ను అడ్డుకున్న వైసీపీ ఏజెంట్.. పోట్లదుర్తిలో ఉద్రిక్తత

ఎంపీ సీఎం రమేష్‌ను పోలింగ్ బూతులోకి వెళ్లకుండా వైసీపీ ఏజెంట్ సుధాకర్ అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఎంపీ తనపై చేయి చేసుకున్నారంటూ సుధాకర్ ఆందోళనకు దిగారు

Samayam Telugu 11 Apr 2019, 9:25 am

ప్రధానాంశాలు:

  • పోట్లదుర్తి పోలింగ్ బూతులో ఉద్రిక్త పరిస్థితులు
  • సీఎం రమేష్, వైసీపీ ఏజెంట్ మధ్య వాగ్వాదం
  • పోలీసుల ఎంట్రీతో పరిస్థితి సద్దుమణిగింది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ramesh
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ సీఎం రమేష్‌ను పోలింగ్ బూతులోకి వెళ్లకుండా వైసీపీ ఏజెంట్ సుధాకర్ అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఎంపీ తనపై చేయి చేసుకున్నారంటూ సుధాకర్ ఆందోళనకు దిగారు.. విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
మరోవైపు సీఎం రమేష్ వర్గం వాదన మరోలా ఉంది. పోలింగ్‌ కేంద్రం బయట వైసీపీ ఏజెంట్లంతా కుర్చీలు వేసుకుని కూర్చోవడంపై అభ్యంతర వ్యక్తం చేశారట. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఓటర్లను భయపెట్టడం, ప్రలోభపెట్టే అవకాశం ఉందన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకే వైసీపీ దౌర్జన్యానికి దిగారంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.