యాప్నగరం

ఏపీలో ఓటర్లకు ప్రలోభాలు.. రూ.16 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువైన మద్యం సీజ్

ఏపీలో పార్టీలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం ఆశచూపుతున్నాయి. ఇలా ప్రలోభాలకు గురి చేసేందకు తరలిస్తోన్న రూ.16 కోట్ల నగదు, రూ.7 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

Samayam Telugu 19 Mar 2019, 11:26 pm
ఎన్నికల వేళ ఏపీలో ఓటర్లకు ప్రలోభాలు ఎక్కువ అవుతున్నాయి. డబ్బు పంచుతూ, మద్యం పంపిణీ చేస్తూ.. పార్టీలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి తిప్పలు పడుతున్నాయి. ఇలా ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రూ.16 కోట్లను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. రూ.7 కోట్ల విలువైన మద్యం పట్టుబడగా.. దాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకూ సీ-విజిల్ యాప్ ద్వారా 1400 ఫిర్యాదులు అందాయని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ జీకే ద్వివేదీ తెలిపారు. ఎక్సైజ్, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్, పోలీస్, ఐటీ, కమర్షియల్ ట్యాక్స్ విభాగాలు పకడ్బందీగా పని చేస్తున్నాయని ఆయన చెప్పారు.
Samayam Telugu ap election officer


విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని సబ్బవరంలో కార్లో తరలిస్తున్న రూ.కోటి నగదును పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. ఈ వాహనం వైజాగ్ సీతమ్మధార నుంచి పాడేరు వెళుతున్నట్లు వారు నిర్ధారించారు. ఆ నగదు తమదని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అధికారులు పోలీసుల దగ్గరకు వచ్చారు. కానీ సరైన ఆ డబ్బుకి సంబంధించి సరైన ఆధారాలు చూపడంలో వారు విఫలమయ్యారు. దీంతో ఆ నగదును వారికి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.