యాప్నగరం

కోడ్ ధిక్కరించి సినిమా ప్రదర్శన.. కడప థియేటర్స్ లైసెన్స్ రద్దు

నిబంధనలకు విరుద్ధంగా కడప జిల్లాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల. సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘంకు సిఫార్సు.

Samayam Telugu 3 May 2019, 5:36 pm
'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలున్నా.. కడప జిల్లాలో సినిమాను రిలీజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తమయ్యింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ.. నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రదర్శించిన రెండు థియేటర్‌ల లైసెన్సులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Samayam Telugu lakshmi.


ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయవద్దని ఆదేశాలు జారీచేసినట్లు ద్వివేదీ గుర్తు చేశారు. సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘంకు సిఫార్సు చేశామన్నారు. అలాగే థియేటర్లపై కేసు కూడా నమోదు చేయాలని ఆదేశించినట్లు ద్వివేదీ తెలియజేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను కడప రాజా థియేటర్‌లో.. పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్‌లలో విడుదల చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు థియేటర్లపై కేసులు నమోదు చేశారు. ఇటు ఎన్నికల సంఘం కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.