యాప్నగరం

జీఎస్టీలా జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: పులివెందులలో బాబు

పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు జగన్‌పై విమర్శలు గుప్పించారు. జీఎస్టీలా జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బాబు ఆరోపించారు.

Samayam Telugu 1 Apr 2019, 6:55 pm
పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. సోమవారం కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. జగన్ లక్ష్యంగా ఘాటైన విమర్శలు గుప్పించారు. పులివెందుల ప్రజలు చూపించిన అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేనన్న బాబు.. ఈ రోజు ఇక్కడే ఉండాలని అనిపిస్తోందన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేసి రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత నాదన్నారు. రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా పులివెందులను తీర్చిదిద్దే బాధ్యత నాదని బాబు హామీ ఇచ్చారు.
Samayam Telugu naidu_copy_1.


చినీ, అరటిపండ్ల తోటలపై జగన్ మోహన్ రెడ్డి ట్యాక్స్ ఉందని బాబు విమర్శించారు. ‘మీరంతా జీఎస్టీలా జగన్ మోహన్ రెడ్డి ట్యాక్స్ పే చేస్తున్నారు. చీనీ, అరటి పండ్ల తోటలపై సూర్ట్ విధానంలో ఇక్కడి దొంగలు 20 శాతం కొట్టేస్తున్నార’ని బాబు విమర్శించారు. పేద రైతుల పొట్టగొడుతున్నారని ఆరోపించిన ఆయన.. సొమ్ము వసూలు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

పులివెందులను హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. పంట ఉత్పత్తుల వారీగా హబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. దళారీ వ్యవస్థ, దోపిడీ విధానం లేకుండా చేస్తామన్నారు.

పులివెందులకు నీళ్లు కావాలని ఒక్క రోజు కూడా జగన్ అడగలేదని బాబు విమర్శించారు. సతీష్ రెడ్డి పోరాటం చేయడం వల్ల పులివెందులకు నీళ్లు ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. జగన్‌కు ఒక్క ఓటేసినా.. మన అధికారాన్ని కేసీఆర్ చేతుల్లో పెట్టినట్టేనని బాబు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.