యాప్నగరం

వైసీపీ అధినేతకు షాకిచ్చిన కొణతాల!

టీడీపీలో చేరేందుకు ప్రయత్నించిన కొణతాల అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఆశించారు. అయితే చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Samayam Telugu 17 Mar 2019, 8:19 am
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంప్ జిలానీలు అటూఇటూ మారుతూ పార్టీలనే కాదు.. ప్రజలనూ తికమక పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరేందుకు జగన్ నివాసానికి వెళ్లిన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ పార్టీ అధినేతకే ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Samayam Telugu konadala


టీడీపీలో చేరేందుకు ప్రయత్నించిన కొణతాల అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఆశించారు. అయితే చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన అనుచరులైన ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ కార్పోరేటర్లు, బెహరా భాస్కరరావు, పోతు సత్యనారాయణ, బొనాల శ్రీనివాసరావు తదితరులతో శనివారం లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిశారు. అరగంట భేటీ తర్వాత తన వారిని ఒక్కొక్కరినీ పరిచయం చేశారు. అనంతరం జగన్ అందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

అయితే కొణతాల రామకృష్ణ మాత్రం పార్టీ కండువా కప్పుకునేందుకు నిరాకరించి జగన్‌కు ఝలక్ ఇచ్చారు. గతంలో తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తే చాలని కోరారు. అవన్నీ తర్వాత చూసుకుందామని జగన్ అన్నప్పటికీ కొణతాల సమ్మతించలేదు. పార్టీలో చేరకుండానే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి వెళ్లిపోవడంతో జగన్ అవాక్కయ్యారు. అయితే తాను ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చించేందుకే తాను జగన్‌ని కలిశానని, పార్టీ చేరేందుకు కాదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.