యాప్నగరం

AP Elections: బెట్టింగ్ బాబులూ 'బీ కేర్‌ఫుల్'.. ఏపీ మంత్రిగారి సూచన

ఏపీ ఎన్నికలపై బెట్టింగులు పెడుతున్న పందెంరాయుళ్లను హెచ్చరిస్తున్న ఏపీ మంత్రి. జాగ్రత్తగా లేకపోతే జేబులు గుల్లవడం ఖాయమంటున్న అమాత్యులవారు.

Samayam Telugu 16 Apr 2019, 4:23 pm

ప్రధానాంశాలు:

  • ఏపీ ఎన్నికలపై జోరుగా బెట్టింగులు
  • చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు
  • బెట్టింగులపై మంత్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu betting
ఏపీ ఎన్నికలు ముగిశాయి.. ప్రజా తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో.. గెలుపుపై ఎవరి ధీమాతో వారు ఉన్నారు. ఇక పనిలో పనిగా పందెంరాయుళ్లు బరిలోకి దిగారు. అభ్యర్థులు, మెజార్టీ, ఎవరు సీఎం అవుతారంటూ బెట్టింగులు మొదలు పెట్టారు. డబ్బు, పొలాలు ఇలా.. జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.
ఈ బెట్టింగుల విషయంలో.. పందెంరాయుళ్లకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓ సూచన చేస్తున్నారు. వైసీపీని నమ్మి పందాలు కాస్తే ప్రజలు గుల్లై పోతారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. అలాగే టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని.. 120 నుంచి 150 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వెళితే వైసీపీ నేతలు సంతోష పడుతున్నారని.. టీడీపీ ఓడిపోతుందంటూ ప్రజలను మభ్య పెడుతున్నారంటున్నారు పుల్లారావు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన పుల్లారావు.. ఎన్నికలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

మోదీ, అమిత్‌షా, ఈసీని అడ్డుపెట్టుకుని కుట్రలు చేశారని ఆరోపించారు పుల్లారావు. ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు, మహిళలు క్యూలైన్లలో గంటల తరబడి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకి అండగా నిలబడ్డారని.. మరోసారి విజయం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు ప్రత్తిపాటి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.