యాప్నగరం

Chandrababu Naidu: టీడీపీ బర్త్ డే మార్చి 29, డెత్ డే మే 23.. ఏపీ ఎన్నికల ఫలితాలపై వర్మ ట్వీట్

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తోన్న తరుణాన వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. టీడీపీ చచ్చిపోయిందంటూ ఆయన ఘాటైన ట్వీట్ చేశాడు. అందుకు కారణాలేంటో కూడా చెప్పాడు.

Samayam Telugu 23 May 2019, 11:55 am
ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తోన్న వేళ.. ఆ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్న నాయకులు, సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం.. టీడీపీ పట్ల తన కసినంతా ట్వీట్టర్ ద్వారా వెల్లగక్కారు. మే 23తో టీడీపీ అంతమైపోతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. పేరు టీడీపీ.. ఆవిర్భావం మార్చి 29, 1982. మరణం మే 23, 2019 అంటూ వర్మ ట్వీట్ చేశారు.
Samayam Telugu rgv babu


టీడీపీ ఓటమికి గల కారణాలను కూడా టీడీపీ మరణానికి కారణాలంటూ వర్మ చెప్పుకొచ్చారు. అబద్ధాలు, వెన్నుపోట్లు, అవినీతి, అశక్తత, వైఎస్ జగన్, నారా లోకేశ్ కారణాలని వర్మ ట్వీట్ చేశాడు.

నారా లోకేశ్ తడబాటు, తప్పిదాలు కూడా టీడీపీ ఓటమికి కారణమని వర్మ తెలిపాడు. ఎన్నికల ముందు వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఏపీ సర్కారు అడ్డు పడిన సంగతి తెలిసిందే. నేను నమ్మిన నిజం ఇదేనంటూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ మూవీని వర్మ తెరకెక్కించారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పోడిచారంటూ వర్మ తన సినిమాకు ప్రచారం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.