యాప్నగరం

Simhadri Tamanna: మంగళగిరి బరిలో ట్రాన్స్‌జెండర్.. తమన్నా నామినేషన్ దాఖలు

మంత్రి లోకేష్‌ పోటీ చేస్తున్న స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన థర్డ్ జెండర్ తమన్నా సింహాద్రి. దమ్ముంటే లోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సవాల్.

Samayam Telugu 25 Mar 2019, 2:42 pm
ఏపీ ఎన్నికల్లో మంగళగరి నుంచి థర్డ్ జెండర్ తమన్నా బరిలోకి దిగారు. సోమవారం (25-03-2019)న అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాజకీయ పార్టీలతో థర్డ్ జెండర్‌కు ఒరిగిందేమీ లేదంటున్నారు తమన్నా.. పార్టీలన్నీ అవసరానికి వాడుకుని మోసం చేశాయన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి థర్డ్ జెండర్‌గా ప్రజా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని.. ఆశీర్వదించాలని కోరారు.
Samayam Telugu tamanna.


మంగళగిరి టికెట్ కోసం జనసేన పార్టీకి దరఖాస్తు చేసుకున్నట్లు తమన్నా చెప్పారు. ఆ పార్టీ తనకు గుర్తింపు ఇవ్వలేదని.. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపై మంగళగిరిలోన ఉంటానని.. ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానంటున్నారు. ఇటు మంత్రి లోకేష్‌కు తమన్నా సవాల్ విసిరారు. లోకేష్‌కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు. నారా లోకేష్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ట్రాన్స్ జెండర్లు తమ హక్కుల కోసం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.