యాప్నగరం

టీడీపీ నేతలతో బాబు సమీక్ష.. విజయసాయి అభ్యంతరం

విజయసాయికి టీడీపీ సమీక్షకు సంబంధమేంటనుకుంటున్నారా.. ఇదేంటి చంద్రబాబు సమీక్ష చేస్తే వైసీపీ ఎంపీ విజయసాయికి వచ్చిన ఇబ్బంది ఏంటని షాకవుతున్నారా.. అక్కడే ఉంది చిన్న ట్విస్ట్.

Samayam Telugu 21 Apr 2019, 9:25 pm

ప్రధానాంశాలు:

  • ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఎంపీ విజయసాయిరెడ్డి
  • చంద్రబాబు టీడీపీ నేతలతో నిర్వహించే సమీక్షపై ఫిర్యాదు
  • టీడీపీ సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ysrcp
ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు... 25 మంది లోక్‌సభ అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఈ నెల 22న (సోమవారం) అభ్యర్థులంతా ఉండవల్లి ప్రజావేదికల జరిగే సమావేశానికి రావాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళిపై అభ్యర్థులతో చర్చించనున్నారు. జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించే అవకాశముంది.
ఇదేంటి చంద్రబాబు సమీక్ష చేస్తే వైసీపీ ఎంపీ విజయసాయికి వచ్చిన ఇబ్బంది ఏంటని అనుకుంటున్నారా.. అక్కడే ఉంది చిన్న ట్విస్ట్. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో.. ప్రభుత్వ సదుపాయం అయిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారన్నది విజయసాయి అభ్యంతరమట. అందుకే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే.. చంద్రబాబు దానిని ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ప్రజా వేదిక ప్రభుత్వానికి సంబంధించిన భవన సముదాయం.. దీనిని పార్టీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులైన వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను పార్టీ అవసరాలకి ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉంది కాబట్టి.. ఈ సమావేశాలు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలంటున్నారు. ఆ సదుపాయాలను ఉపయోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారా? లేదా..? తెలియజేయమంటున్నారు. ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై సమీక్షించి సీఎస్ ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.