యాప్నగరం

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదిగో.. జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా వెలసిన ఫ్లెక్సీ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 31 May 2019, 10:42 am
గతేడాది శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చూవిచూసింది. మొత్తం 175 స్థానాలకు గాను 151 చోట్ల ప్రతిపక్ష వైసీపీ ఘన విజయం సాధించి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. కాగా, విజయవాడలో 'రిటర్న్ గిఫ్ట్' అంటూ ఓ ప్లెక్సీ వెలిసింది.
Samayam Telugu TRS2


గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్, స్టాలిన్‌లతో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గేట్ వే హోటల్‌లో బసచేశారు. ఈ హోటల్ పక్కనే ఈ ప్లెక్సీని ఏర్పాటు చేయడం గమనార్హం. జగన్‌కు కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫోటోతో పాటు ‘థ్యాంక్స్ కేసీఆర్ గారు... ఫర్ రిటర్న్ గిఫ్ట్’ అని ఉంది. దీనిని చిరంజీవి అనే స్థానిక వైసీపీ నేత ఏర్పాటు చేసినట్టు ఫ్లెక్సీపై ఉన్న పేరును బట్టి తెలుస్తోంది.

ఇక, జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు రాష్ట్రాలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు, కరచాలనం అన్న కేసీఆర్, జగన్‌ వయసు చిన్నదే అయినా బాధ్యత మాత్రం పెద్దదని వ్యాఖ్యానించారు. ఈ ఒక్కసారే కాదు మరో రెండు మూడు పర్యాయాలు జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో ఆయనను ప్రజలు గెలిపించారని, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెట్టాలని కేసీఆర్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.