యాప్నగరం

మీరు ఇప్పుడు జనసైనికుడిగా మారడం ఏంటి జేడీ?.. విజయ్‌సాయి సెటైర్లు

ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీపై విమర్శలు గుప్పిస్తోన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఈ సారి మాజీ జేడీ లక్ష్మీనారాయణను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.

Samayam Telugu 18 Mar 2019, 1:44 pm
ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీపై విమర్శలు గుప్పిస్తోన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఈ సారి మాజీ జేడీ లక్ష్మీనారాయణను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆదివారం జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మీరు ఇప్పుడు జనసైనికుడిగా మారడం ఏంటి? తొలి నుంచీ బాబు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నారంటూ విమర్శించారు. రెడ్డి ట్విట్టర్ వేదికంగా సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేశారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Samayam Telugu pjimage (6)


‘35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్‌తో బాధపడుతున్నారు. 14 సంవత్సరాలు సిఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయట పడలేక పోయారేమిటి తుప్పు నాయుడు గారూ? అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారు. మంచి డాక్టర్ ను కలవండి చికిత్స ఇస్తాడు’ అని సెటైర్ వేశారు.

‘బాబూ నీకిది తెలుసా ఈ రోజు ప్రశ్న: ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేసిన తెలుగుదేశం ఎంఎల్ఏ ఎవరు?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దాడి ఘటనను ట్విట్టర్‌లో మరోసారి గుర్తుచేశారు.

మంత్రాలయం టీడీసీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు శనివారం దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై కూడా విజయ్‌సాయి తనదైన శైలిలో చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.. ‘తిక్కారెడ్డిని లేపేసే కుట్ర విఫలమైంది. సొంత గన్‌మెన్లతో ఆయనపై కాల్పులు జరిపించారు. పార్టీ అధినేతే ఈ స్కెచ్ వేశాడని తిక్కారెడ్డికి తెలియదు. బాలనాగిరెడ్డిపైకి నెట్టాలనేది పథకం. కుల మీడియా రోజంతా ఇదే ప్రచారం చేసింది. చివరకు గన్‌మెన్లు బలిపశువులయ్యారు’ అంటూ విమర్శించారు.

‘ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బి-ఫారాలు ఇచ్చిన తర్వాత మీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వర్రావును వెంట పంపించండి చంద్రబాబు గారు. వాళ్లు నామినేషన్ వేయకుండా ఎటైనా వెళ్లి పోగలరు. అసలే క్యాండిటేట్లు దొరకడం కష్టంగా ఉన్నట్టుంది పాపం’ మరో సెటైర్ వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.