యాప్నగరం

టీడీపీ అరాచకాలు.. గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న జగన్

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గవర్నర్‌ను కలవనున్నారు. ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింస గురించి ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Samayam Telugu 15 Apr 2019, 10:57 pm
Samayam Telugu jagan
హైదరాబాద్‌: ఏపీలో ఎన్నికలు ముగిసినా.. పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించడం మానలేదు. ఓవైపు చంద్రబాబు నాయుడు ఈసీ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, తమ పార్టీ కార్యకర్తల హత్య తదితర అంశాలపై ఫిర్యాదు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన గవర్నర్‌ నరసింహన్‌ కలవనున్నారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత టీడీపీ సృష్టించిన అరాచకాల గురించి జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

ఎన్నికలు జరిగిన రోజు టీడీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో దాడులు చేశారని.. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తమ కార్యకర్తలిద్దర్ని వేటాడి చంపారని పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ ఆరోపించారు. ఈసీ వైఖరిని ప్రశ్నిస్తూ చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని.. ఆయన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.