యాప్నగరం

తప్పుడు ప్రచారం, ఎన్నికలకు ముందు ప్రమోషన్లు.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు

అన్నదాత సుఖీభవ పథకంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోన్న వైసీపీ. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక్కరోజు ముందు ఐపీఎస్‌లకు ప్రమోషన్లు ఇచ్చారని ఫిర్యాదు.

Samayam Telugu 20 Mar 2019, 11:10 pm
తప్పుడు ప్రచారంతో టీడీపీ ప్రజల్ని మోసం చేస్తోందంటోంది వైసీపీ. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఓటర్లను మభ్యపెడుతోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీవీల్లో వచ్చే ప్రకటనల్లో అన్నదాత సుకీభవ పథకం కింద ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.15వేలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu ycp.


ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతులకు రూ.15వేలు ఇచ్చామనడం పచ్చి అబద్దమని.. ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రకటనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘవం అధికారుల్ని కలిసి కోరారు.

అన్నదాత సుఖీభవ పథకంతో పాటూ కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమోషన్లపై కూడా వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక్కరోజు ముందు ముగ్గురు ఐపీఎస్‌లకు ప్రమోషన్లు ఇచ్చారని.. ఈ వ్యవహారంపైనా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. ఈ ప్రమోషన్లు ఎలక్షన్ కోడ్‌కు వ్యతిరేకమన్నారు.

ఏబీ వెంకటేశ్వరరావు, డీజీపీ ఇంటిలిజెన్స్.. కేఆర్‌ఎమ్ కిషోర్ కుమార్ డీజీపీ, రైల్వేస్‌.. సీహెచ్‌.డీ తిరుమలరావు, విజయవాడ పోలీస్ కమిషనర్‌లకు ఏపీ ప్రభుత్వం సూపర్ టైమ్స్ స్కేల్‌తో పాటూ డీజీపీలుగా ప్రమోషన్లు ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.