యాప్నగరం

Karnataka Results: ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని ఆశిస్తున్నా: ఒవైసీ

Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ విజయంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తొలి ప్రకటన చేశారు. ఆదివారం ఒవైసీ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 14 May 2023, 11:25 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటక కాంగ్రెస్ విజయంపై స్పందించిన ఒవైసీ
  • హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్టు వ్యాఖ్య
  • వేరే రాష్ట్రాల్లో ఎంఐఎంను బలోపేతం చేస్తామని స్పష్టం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Asaduddin Owaisi
అసదుద్దీన్ ఒవైసీ
Karnataka Results: కర్ణాటక ఫలితాలు వెలువడ్డాయి.. తమ పార్టీకి ఇద్దరు అభ్యర్థులు గెలవలేకపోయినా.. పార్టీ అభ్యర్థులకు ఓటు వేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. మరింత కష్టపడి పనిచేస్తామని Asaduddin Owaisi స్పష్టం చేశారు.
కర్ణాటక ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్‌కు అధికారం దక్కిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్టు ఒవైసీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. తన పార్టీ విస్తరణ గురించి కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో AIMIM బలోపేతం కొనసాగుతుందని ఒవైసీ స్పష్టం చేశారు.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు మే 13న వెల్లడయ్యాయి. ఇందులో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుని విజయం సాధించింది. బీజేపీ కేవలం 66 స్థానాలకు పరిమితమైంది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) 19 స్థానాల్లో విజయం సాధించింది. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. సీఎం కావాలనే ఆకాంక్షను బహిరంగంగానే వ్యక్తం చేశారు.
మరోవైపు కర్ణాటకలో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం ఆదివారం బెంగళూరులోని షాంగ్రీలా హోటల్‌లో జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు. అయితే.. సీఎం ఎంపిక విషయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేస్తున్నట్టు ఎమ్మెల్యేలు తీర్మానించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.