యాప్నగరం

Karnataka Elections: సిద్ధరామయ్య సెంటిమెంట్ రాజకీయం.. 'వరుణ' కరుణిస్తుందా?

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన నియోజకవర్గాల్లో వరుణ ఒకటి. అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య నామినేషన్ దాఖలు చేశారు. నంజన్‌ గూడ్ తాలూకా పంచాయతీ కార్యాలయానికి తన మద్దతుదారులతో వచ్చిన సిద్ధరామయ్య.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకు ముందు జరిగిన సభలో సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 19 Apr 2023, 8:28 pm

ప్రధానాంశాలు:

  • వరుణ నుంచి సిద్ధరామయ్య నామినేషన్ దాఖలు
  • వరుణ మట్టి బిడ్డను అంటూ సెంటిమెంట్ డైలాగ్
  • బీజేపీ, జేడీఎస్ నాటకాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Siddaramaiah making nomination
నామినేషన్ వేస్తున్న సిద్ధరామయ్య
Karnataka Elections: వరుణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధరామయ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు సిద్ధరామయ్య తన స్వగ్రామమైన హుండీలోని సిద్ధరామేశ్వరాలయం, శ్రీరామ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చాముండి కొండకు వెళ్లి పూజలు చేసి.. తల్లి చాముండేశ్వరి ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో Siddaramaiah కీలక వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు.
నంజన్‌గూడ్‌లో జరిగిన బహిరంగ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. 'నేను ఇక్కడి మట్టి బిడ్డను. వరుణ నియోజకవర్గంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజలు నన్ను సొండవాడిలా భావిస్తున్నారు. గతంలో వరుణ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడల్లా.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాను. నేను సాధించిన విజయాలు ఇక్కడి ప్రజల జీవితాల్లో కనిపిస్తాయి. మీ ఆశీర్వాదంతో.. ఈసారి నా గెలుపు ఖాయమనే నమ్మకం ఉంది. ఇదే నా చివరి ఎన్నిక' అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

రామనగరలో పుట్టి.. బెంగళూరు నగరంలో రాజకీయ నాయకుడిగా ఎదిగిన వి.సోమన్నను.. బీజేపీ బలవంతంగా వరుణలోకి తీసుకొచ్చిందని సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ ఎన్నికల్లో అల్లరిమూకలకు.. వరుణ ఇంటి బిడ్డకు మధ్య యుద్ధం జరుగుతోందని వ్యాఖ్యానించారు. డబ్బు కోసం తనను ప్రజలు విడిచిపెట్టబోరని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారొచ్చని విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పాలన చూస్తే.. ఇలాగే ఉందన్నారు.

'ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించి.. అభివృద్ధి, ప్రజానుకూలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అది ఓటర్ల చేతుల్లోనే ఉంది. దేశాభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. అన్ని హామీలను అమలు చేస్తాం. కర్ణాటక ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఈసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కర్ణాటక రాష్ట్రం వెనక్కి వెళ్లడం ఖాయం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారు' అని సిద్ధరామయ్య వివరించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.