యాప్నగరం

Karnataka CM: రెండేళ్లు సిద్ధూ.. మూడేళ్లు శివకుమార్.. అధిష్ఠానం ప్రతిపాదన.. ససేమిరా అంటోన్న డీకే

Karnataka CM కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా.. ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. సీఎంగా ఎవర్ని నియమించాలన్న విషయంలో కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వాస్తవానికి సీఎం పేరును మంగళవారం ప్రకటిస్తామని అధిష్ఠానం ప్రకటించింది. కానీ, చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఎటూ తేల్చుకోలేకపోయింది. దీంతో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 17 May 2023, 9:31 am

ప్రధానాంశాలు:

  • కర్ణాటక సీఎం పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • వెనక్కి తగ్గని సిద్ధ రామయ్య, డీకే శివకుమార్
  • కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారిన ఎంపిక
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu డీకే
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా.. ముఖ్యమంత్రి పదవి ఎవరికి కట్టబెట్టాలనేది కొలిక్కి రాలేదు. మూడు రోజుల నుంచి దీనిపై ఎడతెగని చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నా.. కాంగ్రెస్‌ నాయకత్వం ఏటూ తేల్చలేకపోతోంది. సీఎం పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీఎం పేరును మంగళవారం ప్రకటిస్తామని అధిష్ఠానం వెల్లడించినా.. చర్చలు కొలిక్కి రాకపోవడంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది. బుధవారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
కాగా, మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, తుదుపరి మూడేళ్లు డీకే శివకుమార్‌ ఉంటారని అధిష్ఠానం ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. అయితే, శివకుమార్ మాత్రం ససేమిరా అంటున్నారట. తనను సీఎం చేయాలని లేకుంటే ఎమ్మెల్యేగానే కొనసాగుతానని ఆయన అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు మరోసారి బుధవారం సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ వర్గపోరాటం ఆ పార్టీని రెండు చీల్చుతుందని బీజేపీ భావించినా.. ఎన్నికల ముందు వరకు అలాంటిదేమీ మా మధ్య లేదని ప్రకటిస్తూ వచ్చిన ఆ ఇద్దరూ తీరా ఫలితాలు వచ్చాక వారి నిజస్వరూపాలు బయటపెట్టారు. ఇద్దరి మధ్యా ఇంత విభేదాలు ఉండి అంతలా ఎలా నటించారని ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తున్నారు.

సిద్ధరామయ్యకు ఇప్పటికే ఒకసారి అవకాశమిచ్చారని.. ఐదేళ్లు ఆయన సీఎంగా కొనసాగారని డీకే వాదిస్తున్నారు. ఆయన దుష్పరిపాలన కారణంగా ప్రధాన సామాజిక వర్గమైన లింగాయత్‌లు సిద్ధూకు ఎదురుతిరిగారని గుర్తుచేశారు. ఇప్పుడు తనకు అవకాశమివ్వాలని కోరుతున్న డీకే.. 2006లో సిద్దూ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పదవులు అనుభవించారని, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా, ఒకసారి ఐదేళ్ల పూర్తికాలం సీఎంగా పనిచేశారని తెలిపారు. ఆయన వల్ల ఖర్గేకు కూడా సీఎం పదవి రాకుండా పోయిందని గుర్తుచేశారు.

ఒకవేళ, తనను కాకుంటే ఖర్గేను ముఖ్యమంత్రిని చేసినా తనకు అభ్యంతరం లేదని కుండబద్దలు కొట్టాడు. 2019లో కాంగ్రె్‌స-జేడీఎస్‌ సంకీర్ణం కుప్పకూలాక రాష్ట్రంలో పార్టీని తానే పునర్నిర్మించానని తెలిపారు. డీకే వెళ్లిపోయాక సాయంత్రం ఆరు గంటలకు సిద్దూ వచ్చి ఖర్గేతో చర్చలు జరిపారు

ఇక సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లో ఏ ఒక్కరిని తగ్గించినా అసమ్మతి పార్టీని కుదిపేయక మానదు. ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే, రెండో నేత సూచించిన వారికి కీలకమైన శాఖలు ఇచ్చి తీరాల్సిందే. అసలే సీఎం పదవిని కోల్పోయిన అక్కసుతో ఉన్న నేత పాలనపై తనదైన ప్రభావాన్ని చూపకమానరు. 2019లో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ఈ అంతర్గత రాజకీయ కుమ్ములాటలే కారణం.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.