యాప్నగరం

మహిళా ఎమ్మెల్యేనే లేని అసెంబ్లీ, ఒక్కరు కూడా నెగ్గలేదు!

వరుసగా రెండో శాసనసభ ఎన్నికల్లోనూ మహిళా నేతలకు నిరాశే ఎదురైంది. కనీసం పోటీ చేసే వారి సంఖ్య పెరిగినా కనీసం ఒక్కరిని కూడా విజయం వరించలేదు.

Samayam Telugu 13 Dec 2018, 10:26 pm
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఫలితాలు రెండు రోజుల కిందట వచ్చాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయనుంది. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది. అయితే చిన్న రాష్ట్రం ఫలితాలు కాస్త భిన్నంగా ఉన్నాయి.
Samayam Telugu Mizoram


ఇతర నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీకి కనీసం ఒక్క మహిళ అయినా ఎన్నికయ్యారు. కానీ మిజోరంలో 40 సీట్లలో ఒక్క సీటు కూడా వారికి దక్కకలేదు. అత్యధికంగా బీజేపీ ఆరుగురు మహిళలను బరిలో నిలపగా, ఓవరాల్‌గా మిజోరం ఎన్నికల్లో 15 మంది పోటీచేశారు. కానీ ఒక్క మహిళను కూడా విజయం వరించకలేదు. రాష్ట్రంలో మొత్తం 7,07,395 మంది ఓటర్లు ఉన్నారు. ఓటు వేసిన వారి సంఖ్య 6,20,332 కాగా, అందులో మహిళా ఓటర్ల సంఖ్య 3,20,401. ఓటింగ్ శాతంతో పాటు, ఎక్కువ ఓట్లలోనూ మహిళలదే హవా. కానీ ఒక్క మహిళకు కూడా అసెంబ్లీకి వెళ్లే అవకాశాన్ని ఓటర్లు కల్పించలేదు.

అత్యధికంగా 26 స్థానాలు నెగ్గిన ఎంఎన్ఎఫ్ నుంచి సైతం మహిళా నేతను విజయం వరించలేదు. అంతేకాదు ఆ మహిళా నేతలందరికీ కలిపి 15 వేల ఓట్లు కూడా పడలేదు. పురుషాధిక్యతతో పాటు మహిళలను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చెందదన్న భావన వారిని ఓడించినట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మిజోరం కాస్త వెరైటీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.