యాప్నగరం

స్టాలిన్, ఆయన కొడుక్కి ఊహించని షాక్.. గూగుల్ పేలో ఓటర్లకు డబ్బులు.?

తమిళనాట ఎన్నికల రాజయం వేడెక్కింది. అధికార ఏఐఏడీఎంకే ప్రతిపక్ష నేత స్టాలిన్, డీఎంకే కీలక నేతలను టార్గెట్ చేసింది. స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ సహా మరో ముగ్గురిని ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించాలని ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 5 Apr 2021, 5:54 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి ఊహించని షాక్ ఎదురైంది. స్టాలిన్, ఆయన కొడుకు సహా మరో ముగ్గురిని ఎన్నికల బరి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అధికార ఏఐఏడీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు పాల్పడ్డారని.. ఆ ఐదుగురిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. తండ్రీకొడుకులతో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకులను పోటీ నుంచి తప్పించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
stalin


డీఎంకే చీఫ్ పోటీ చేస్తున్న కొలత్తూర్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ బరిలో నిలిచిన చెపాక్ ట్రిప్లికేన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ పోటీలో ఉన్న కాట్పాడి, తిరుచిరాపల్లిలో నెహ్రూ, తిరువణ్ణామలై నుంచి వేలు డీఎంకే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. డీఎంకే కీలక నేతలుగా ఉన్న ఈ ఐదుగురి నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు అన్నాడీఎంకే ఆరోపించింది.

ఎంకే స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరులో ఏప్రిల్ 2 నుంచే నగదు పంపిణీ మొదలైందని.. ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇస్తున్నట్లు అన్నాడీఎంకే న్యాయవాది విభాగం జాయింట్ సెక్రటరీ ఈసీకి ఫిర్యాదు చేశారు. స్టాలిన్ భార్య దుర్గా స్టాలిన్ ఇప్పటికే నియోజకవర్గంలో తిష్టవేసి మహిళా గ్రూపులకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొందరికి జీ పే వంటి ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా కూడా డబ్బులు పంపిణీ చేశారని.. ఈసీ పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అయితే అన్నాడీఎంకే ఆరోపణలను డీఎంకే అధికార ప్రతినిధి కనిమొళి సోము కొట్టిపారేశారు. అత్యధిక మెజార్టీతో డీఎంకే విజయం సాధించబోతోందని.. అందుకే పార్టీలోని కీలక నేతలను అన్నాడీఎంకే టార్గెట్ చేసి మరీ ఆరోపణలు చేస్తోందని ఆమె స్పష్టం చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.