యాప్నగరం

Telangana Polls: సాయంత్రం 5 దాటితే ఓటుకు అనుమతి లేదు: ఈసీ

పోలింగ్ ఉన్నందున తెలంగాణతో పాటు ఏపీలోనూ శుక్రవారం ప్రైవేట్ సంస్థలకు సైతం సెలవు ప్రకటించారని రజత్‌కుమార్ తెలిపారు.

Samayam Telugu 6 Dec 2018, 7:10 pm
తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ అన్నారు. ఆ 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకే చేరుకున్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తారని వెల్లడించారు. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ సమయానికి పోలింగ్ కేంద్రానికి చేరిన వారిని మాత్రమే ఓటు వేయనిస్తామని రజత్‌కుమార్ వివరించారు.
Samayam Telugu Rajath Kumar


మద్యం సేవించి వస్తే కఠిన చర్యలు
పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లు, కెమెరాలు నిషేధించామన్నారు. ఓటర్లు ఎవరైనా మద్యం సేవించి ఓటేసేందుకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రతి ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం 55ను మించడం లేదని, ఈ ఏడాది ఏడున్నర లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారని వివరించారు. పోలింగ్ ఉన్నందున తెలంగాణతో పాటు ఏపీలోనూ శుక్రవారం ప్రైవేట్ సంస్థలకు సైతం సెలవు ప్రకటించారని రజత్‌కుమార్ తెలిపారు.

తెలంగాణలో ఇటీవల తీసుకొచ్చిన సీ-విజిల్ యాప్‌కు విశేష స్పందన వస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా 8 వేలకు పైగా ఫిర్యాదులు రాగా, 90 శాతం ఫిర్యాదులు పరిష్కరించినట్టు చెప్పారు. ఓటింగ్ రోజు కూడా ఎక్కడైనా సమస్యలు తలెత్తితే సీ-విజిల్ యాప్ ద్వారా అధికారికంగా సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.