యాప్నగరం

Chandrababu Naidu: కేసీఆర్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు: చంద్రబాబు

కేసీఆర్ చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందించారు. మోదీతో లాలూచీ పడిన కేసీఆర్ తనను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు.

Samayam Telugu 24 Nov 2018, 8:16 pm
‘‘కేసీఆర్ ప్రతి రోజు మనల్నే తిడతారు. ఆయన అలా ఎందుకు తిడతారో నాకైతే అర్థం కావడం లేదు. హైటెక్ సిటీ కట్టించినందుకా? లేదా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపినందుకా? హైదరాబాద్ గొప్ప నగరంగా తీర్చిదిద్ది తెలుగు జాతికి ఇస్తే.. సరిగా పాలించకుండా నన్ను విమర్శిస్తు్న్నారు’’ అంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
Samayam Telugu Untitled121


కేసీఆర్‌ టీడీపీని, నన్ను విమర్శిస్తూ.. మోదీతో లాలూచీ పడ్డారని, అందుకే తాను ప్రజాకూటమికి ఒప్పుకున్నామని తెలిపారు. కేసీఆర్‌కు తను విమర్శించే హక్కులేదన్నారు. అనంతపురంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమ్మేళనంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం విజయవాడ నుంచి తెలంగాణ టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌‌లో మాట్లాడిన చంద్రబాబు.. తెలంగాణలో కూటమి పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. 28, 29 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.