యాప్నగరం

Jana Reddy: జానారెడ్డికి చేదు అనుభవం.. ఓటర్లపై మండిపాటు!

కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఇక్కడ ఉండండి, వేరే పార్టీవాళ్లు ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. మీ ఓట్లు అక్కర్లేదంటూ జానారెడ్డి మండిపడ్డారు.

Samayam Telugu 21 Nov 2018, 11:53 pm
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతిపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సొంత నియోజకర్గంలో చేదు అనుభవం ఎదురైంది. తమకు చాలా సమస్యలున్నాయంటూ జానాను స్థానికులు నిలదీశారు. దీంతో ఆవేశానికి లోనైన జానారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఇక్కడ ఉండండి. వేరే పార్టీవాళ్లు ఇక్కడ ఉండొద్దు అంటూ హుకూం జారీ చేశారు.
Samayam Telugu Janareddy


నాగార్జునసాగర్ అభ్యర్థి జానారెడ్డి తన నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం నాగార్జునపేట తండాలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని జానారెడ్డిని ఓటర్లు నిలదీశారు. ఆవేశానికి లోనైన జానారెడ్డి.. కేవలం ఏం కావాలో అడగాలని సూచించారు. ప్రతివాడు మాట్లాడేటోడయ్యాడని, తాను చెప్పేది వినాలంటూ మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోండని దురుసుగా ప్రవర్తించారు.
మీరు ఓటువేస్తే ఎంత, వేయకపోతే ఎంత అంటూ తనను ప్రశ్నించిన వారిపై జానారెడ్డి మండిపడ్డారు. తండాలలో మీరు భయపెడితే భయపడేవాళ్లం కాదన్నారు. సమస్య చెబితే పోరాడుతామని, మమ్మల్ని నమ్మనివాళ్లు ఇక్కడికి ఎందుకొచ్చారని ఓటర్లనే ప్రశ్నించారు. స్థానికులు జానారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, జానారెడ్డి తీరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.