యాప్నగరం

గెలిస్తే మీ బట్టలిప్పి ఊరేగిస్తా! : రాజగోపాల్‌రెడ్డి ఫైర్‌

ఎంపీగా చేశావు, ఎమ్మెల్సీగా చేస్తున్నావు.. మాకు ఏం చేశావంటూ నిలదీసిన ప్రజలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిప్పులు చెరగడం విడ్డూరంగా ఉంది.

Samayam Telugu 5 Dec 2018, 12:54 am
తెలంగాణలో ముందస్తు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన సమయంలో పార్టీ అధిష్టానంపైన విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీగా చేశావు, ఎమ్మెల్సీగా చేస్తున్నావు.. మాకు ఏం చేశావంటూ నిలదీసిన ప్రజలపై ఆయన నిప్పులు చెరిగారు. తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లందరిని బట్టలూసి ఊరేగిస్తానంటూ ఓటర్లను హెచ్చరించడం హాట్‌ టాపిక్‌గా మారింది.
Samayam Telugu Komatireddy RajGopal Reddy


నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్‌ 4న) ఎన్నికల ప్రచారానికి నాంపల్లి మండలం తుంగపాడ్‌కు వెళ్లిన రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు అడ్డుకున్నారు. ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి తమకు చేసిన అభివృద్ధిని చెప్పాలని నిలదీశారు.

ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చావని ప్రశ్నించిన గ్రామస్తులు, ప్రచారం చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో తమ నేతను అడ్డుకుంటావా అని కాంగ్రెస్‌ కార్యకర్తలు దూసుకురావడంతో, గ్రామస్తులు కూడా తగ్గకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు గ్రామస్తులకు సర్దిచెప్పి రాజగోపాల్‌రెడ్డిని అక్కడి నుంచి సురక్షితంగా పంపినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.