యాప్నగరం

ముసుగులో గుద్దులాట.. మహాకూటమి రహస్య మంతనాలు

మహా కూటమిలోని నాలుగు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు.. ఈ నేపథ్యంలో శనివారం గండిపేటలో రహస్యంగా సమావేశమయ్యారు.

Samayam Telugu 13 Oct 2018, 12:54 pm
న్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహాకూటమిలో టెన్షన్ పెరుగుతోంది. సీట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో అంతా తలలు పట్టుకుంటున్నారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా శనివారం కూటమి నేతలంతా రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది.
Samayam Telugu Untitled


గండిపేటలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ నాయకుడు ఎల్.రమణ, టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఓ ముఖ్య నేత హాజరైనట్లు తెలిసింది. ఈ చర్చలో మహాకూటమి పేరును మార్చాలనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే, సీట్ల పంపకం ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేసి, అభ్యర్థులను ఖరారు చేయాలని వెల్లడించినట్లు తెలిసింది.

కొనసాగుతున్న ప్రతిష్టంభన:
ఈ సమావేశంలో కూడా సీట్ల పంపకం ఏకాభిప్రాయం కుదరనట్లు తెలిసింది. టీడీపీ 15 సీట్లు కోరుతుండగా.. కేవలం 9 సీట్లు ఇచ్చేందుకే కాంగ్రెస్ మొగ్గుచూపుతోంది. సీపీఐ కోరుతున్న ఆరు సీట్లలో మూడు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, టీజేఎస్ కోరిన16 సీట్లలో 8 సీట్లు మాత్రమే ఇవ్వగలమని కాంగ్రెస్ వెల్లడించడంతో ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత ప్రతిపాదనలపై ఆయా పార్టీల ముఖ్యనేతలంతా మరోసారి సమావేశమై ఒకటి రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ముగించే అవకాశాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.