యాప్నగరం

Telangana Voter ID: ఓటరు జాబితాలో పేరు నమోదు ఎలా? ఐడీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా ఇలా చేయండి.

Samayam Telugu 29 Nov 2023, 11:06 am
మీకు ఓటరు గుర్తింపు (Voter ID) కార్డు లేదా? మీ పేరు ఓటరు జాబితాలో ఇంకా నమోదు చేసుకోలేదా? అయితే, ఇలా చేయండి. భారత ఎన్నికల వ్యవస్థ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించింది. ఈ సందర్భంగా ఏటా ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మీరు వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు.
Samayam Telugu Untitled1111

Read also: రాష్ట్రం నుంచి రాష్ట్రానికి ఓటర్ ఐడీని బదిలీ చేసుకోవడం ఎలా?
ఆన్‌లైన్లో ఇలా:

  • మీరు తెలంగాణలో ఓటు నమోదు చేసుకోవాలనుకుంటే http://www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
  • అందులో ఇ-రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే 6, 7, 8, 8ఏ దరఖాస్తులు కనిపిస్తాయి.
  • మొదటిసారి ఓటు నమోదు చేసుకునే వ్యక్తులు ఫామ్-6 అమలు తీసుకోండి.
  • ఇందులో మీ పేరు పేరు, చిరునామా, ఫోటోలు, ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీ తదితర వివరాలు పొందుపరిచి ‘సబ్‌మిట్’ చేయండి.
  • ‘సబ్‌మిట్’ తర్వాత మీ ఫోన్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది.
  • ఆ నెంబర్‌‌ను మీ దగ్గర్లోని ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు చూపించి, మీ అడ్రస్ ప్రూఫ్‌లు చూపించాలి.
  • వాటిని పరిశీలించిన తర్వాత అధికారులు ఇంటికి వచ్చి మీ వివరాలు సరిచూస్తారు.
  • వెరిఫికేషన్ పూర్తైన తర్వాత పోస్టు ద్వారా గుర్తింపు కార్డు వస్తుంది.
  • మీ రిజిస్ట్రేషన్ నంబరుతో అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
  • E-Registration –> Assembly constituency –> Track Your Statusలో రిజిస్ట్రేషన్ నంబరు ఎంటర్ చెస్తే మీ అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది.
Read also: ఓటరు ఐడీ పోయిందా? డూప్లికేట్ ఐడీకి ఇలా దరఖాస్తు చేయండి!
ఓటు నమోదు, సవరణల ఫారాలు ఇవే..

✦ ఫారం 6 - ఇప్పటి వరకూ ఓటు నమోదు చేసుకోని కొత్త ఓటర్లు ఈ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.
✦ ఫారం 7- ఓటరు కార్డు తొలగింపు కోసం ఈ ఫారం వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా చనిపోయినా, వేరే నియోజకవర్గానికి మారినా.. వేరే చోటికి బదిలీ అయినా ఈ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.
✦ ఫారం 8 - పేరు, చిరునామాల్లో దోషాలు ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ ఫారం వినియోగించుకోవాల్సి ఉంటుంది.
✦ ఫారం 8ఏ - చిరునామా మారినట్టయితే మార్పుల కోసం ఈ ఫారం పూర్తి చేయాల్సిఉంటుంది.
Read also: ఓటరు లిస్టులో మీ పేరులేకపోయినా ఓటు వేయొచ్చు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.