యాప్నగరం

కేసీఆర్ ఇలాకాలో అభ్యర్థి అదృశ్యం.. టీఆర్ఎస్ పనేనా?

నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఆచూకీలేని అభ్యర్థి. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు.

Samayam Telugu 27 Nov 2018, 7:36 pm
జ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలోకి దిగిన కె.దినేష్ చక్రవర్తి అదృశ్యమైనట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మురళీధర్ రావు హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఆయన కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు స్పందించింది.
Samayam Telugu Untitled1211


ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాాసనం.. దినేష్ చక్రవర్తిని మంగళవారం కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. కొద్ది రోజులు దినేష్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దినేష్ ఎప్పటినుంచైతే కనిపించకుండా పోయారో అప్పటి నుంచి ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌‌లో కూడా ఆయన పేరు మిస్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆ పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ స్థానంలో.. ఆయనపై పోటీకి దిగిన అభ్యర్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ నుంచి గజ్వేల్‌లో పోటీ చేస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డి.. పోలీసులు తనను వేదిస్తున్నారంటూ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. గజ్వేల్‌లో హరీష్ రావు కాాంగ్రెస్ కార్యకర్తలను భయపెడుతున్నారని వంటేరు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో డబ్బులున్నాయని చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.