యాప్నగరం

కొడంగల్‌ అభ్యర్థి ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం

ఐటీ సోదాలపై తమకు సీల్డ్‌ కవర్‌లో నివేదిక వచ్చిందని రజత్‌కుమార్‌ వెల్లడించారు. నివేదిక వివరాలు త్వరలో బహిర్గతం చేస్తామన్నారు.

Samayam Telugu 28 Nov 2018, 10:07 pm
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గం కొడంగల్‌. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ వ్యూహాలు రచియిస్తున్నారు. అయితే బుధవారం అనూహ్యంగా కొడంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఇంట్లో, ఇతరత్రా ఆస్తులపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
Samayam Telugu patnam-narender-reddy


వికారాబాద్‌ జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్‌లోని నరేందర్‌రెడ్డి నివాసంలో (నవంబర్‌ 28) తెల్లవారుజామున దాదాపు 45 నిమిషాల పాటు సోదాలు జరిగినట్లు సమాచారం. ఐటీ సోదాల్లో భారీగా నగదు దొరికినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుఆర్‌ ఐటీ దాడులపై స్పందించారు. పట్నం నరేందర్‌రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరిగినట్లు నిర్దారించారు. ఐటీ సోదాలపై తమకు సీల్డ్‌ కవర్‌లో నివేదిక వచ్చిందని రజత్‌కుమార్‌ వెల్లడించారు. నివేదిక వివరాలు త్వరలో బహిర్గతం చేస్తామన్నారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌రెడ్డి లాంటి కీలకనేత బరిలో ఉండటం, మరోవైపు నరేందర్‌రెడ్డి విజయం కోసం కేసీఆర్‌ వ్యూహాలు రచించడంతో కొడంగల్‌ నియోజకవర్గ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.